రామసేతుని_నిర్మించిన_వీరుడు__నీలుడు...!

 #రామసేతుని_నిర్మించిన_వీరుడు__నీలుడు...!


రామాయణంలో రాముడు ప్రధాన పాత్రధారి కావచ్చు..  మనుష్య రూపంలో సంచరించిన దేవుడే కావచ్చు.. కానీ.. ఆ అవతార పురుషునికి కూడా వానరుల అవసరం పడింది. సీతమ్మ వారి జాడని వెతికి పట్టుకోవడం దగ్గర నుంచి, రావణుని చెర నుంచి ఆమెని విడిపించడం వరకూ... అడుగడుగునా వానర సైన్యం రామునికి తోడ్పడింది. వారిలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి పాత్రలు మాత్రమే మనకు తెలుసు... కానీ మరో ముఖ్యమైన వానరుడు ‘నీలుడు’ గురించి చాలా తక్కువ మంది విని ఉంటారు.



 సీతమ్మ లంకలో ఉందని తెలియగానే, వానర సేనంతా దక్షిణ దిక్కుగా కదిలింది. రాముని అదుపాజ్ఞలతో, సుగ్రీవుని అధికారంతో కదిలిన ఆ సేనకు నీలుడు అనే వానరుడు నాయకత్వం వహించాడు. నీలుడు అగ్ని దేవుని కుమారుడు, మహాబల సంపన్నుడు. అలాంటి నీలుని ఆధ్వర్యంలో వానర సేన సముద్ర తీరానికి వచ్చి నిల్చొంది.. అక్కడి నుంచి లంకకు చేరడం ఎలా అన్న మీమాంశ మొదలైంది. ఆంజనేయునితో సమానంగా నీలుడు కూడా ఆ సముద్రం మీదుగా లంక వరకూ లంఘించగలడు. కానీ మిగతా వానరుల పరిస్థితో..! అందుకోసం సముద్రం మీద వారధి నిర్మించడం ఒకటే మార్గమని పెద్దలంతా నిశ్చయించారు.


 వారధి నిర్మించాలన్న ఆలోచన బాగానే ఉంది. కానీ ఆ పనికి సారధ్యం వహించేదెవరు..? దానిని సాధించేది ఎలా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. అందుకు నలుడు అనే వానరునితో కలిసి నీలుడు ముందుకు వచ్చాడు. కొన్ని రామాయణ గాథలు నల, నీలుల చిన్నతనానికి సంబంధించి ఒక కథను పేర్కొంటాయి. ఈ నల, నీలులు ఇద్దరూ చిన్నప్పుడు మహా అల్లరి చేసేవారట.


రుషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి వస్తువులన్నింటినీ ఎత్తుకు వెళ్లి నీటిలో పడవేసేవారట.. అందుకని నల, నీలులు నీటిలో ఏం వేసినా కూడా అవి మునిగిపోవంటూ రుషులు శపించారు. ఇప్పుడు ఆ శాపాన్నే వరంగా మార్చుకుని సముద్రం మీద వారధిని నిర్మించేందుకు నల, నీలులు సిద్ధమయ్యారన్నమాట..! అలా వారి ఆధ్వర్యంలో రామసేతు నిర్మాణం జరిగింది. నలుడు, నీలుడు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటంతో... అవన్నీ ఒక్క దరికి చేరి వారధి నిర్మితమయ్యింది.


వారధిని దాటి లంకలో అడుగుపెట్టిన తరువాతైతే నీలుని పరాక్రమం వర్ణింప శక్యం కాదు. తూర్పు వైపు సేనలకు నాయకత్వం వహిస్తూ లంకలో ప్రళయమే సృష్టించాడు. కుంభకర్ణుని కుమారుడైన నికుంభుని నిలువరించాడు. రావణాసురుని సేనా నాయకుడైన ప్రహస్తునితో తలపడ్డాడు. శరీరమంతా రక్తం ఏరులై పారుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా ప్రహస్తునితో కలియపడ్డాడు. చివరికి పెద్ద బండరాతి తో ప్రహస్తుని మోదడంతో గెలుపు నీలుని పరమైంది. ప్రహస్తుని మరణంతో రాక్షస మూకంతా చెల్లాచెదురై పోయింది. ఇక రావణాసురుడు రంగంలోకి దిగక తప్పలేదు.


 యుద్ధంలోకి అడుగుపెట్టిన రావణాసురుని నీలుడు తెగ చిరాకు పరిచాడు. నీలుని సంహరించేందుకు రావణాసురుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినా ఉపయోగం లేకపోయింది. నీలుడు అగ్నిదేవుని కుమారుడు కావడంతో అతని మీద ఆ అస్త్రం పని చేయనే లేదు. ఆ తరువాత కూడా నీలుడు మహుదరుడు వంటి రాక్షస ప్రముఖుల నెందరినో సంహరించాడు. మరోవైపు రాముని చేతిలో రావణాసురునికి చావు మూడటంతో యుద్ధం పరిపూర్ణమైంది.


 రామకథలో నీలుని పాత్ర చిరస్థాయిగా మిగిలిపోయింది..

#రామసేతుని_నిర్మించిన_వీరుడు__నీలుడు...!


Rama may be the main role player in Ramayana.. He may be the God who has wandered in the form of human.. But.. that incarnation man also needed monkeys. From finding out the trace of Seetamma, to releasing her from Ravana's lap... the monsoon army joined Rama on every step. We know only the characters like Sugriva, Hanuman, Jambavantha among them... But very few have heard about another important monkey 'Neeludu'.


As soon as it was known that Seetamma is in Lanka, the entire Vanara Sena moved south. A monkey named Neeludu led the army which moved with the orders of Rama and with the power of Sugreeva. Neeludu Agni is the son of God, the wealth of great power. Under the supervision of that kind of water, Vanara Sena came to the sea shore and stood.. From there, how to reach Sri Lanka, the meme has started. Like Anjaneya, Neeludu can also break through that sea to Sri Lanka. But with the rest of the monsoon situation..! the elders have decided that building a heir on the sea is the only way.


The idea of building a Varadhi is good. But who is the one who can do that work..? How to achieve that..? Questions started.. So Neeludu came forward with a monkey named Naludu. Some Ramayana stories tell a story about the childhood of Nala and Neelu. These Nala and Neelu both used to be very naughty in their childhood.


When the Rushis were doing penance, they would have taken all their things up and thrown them in the water.. So, Rushis cursed that whatever you put in the water, they would not drown. Now, Nala and Neelu are ready to convert that curse as a boon and build a heir on the sea..! In that way, Ramasethu was constructed under their supervision. With the name of Rama on the stones that were divided into the sea of four and water... all of them reached one way and built a Varadhi.


The power of water cannot be described only after crossing Varadhi and stepping into Lanka. Leading the army on the east side, he created a flood in Sri Lanka. Nikumbhu, the son of Kumbhakarna, has stopped. Ravanasuru's army leader fell down with a prabhastu. Even though blood is flowing all over the body, he is mixed with the flow without returning. At last, the victory is over with a big bandarati and the fight of the leader. The monster's nose has been shattered with the death of the Prahastu. Now Ravanasura has not missed entering the field.


Neeludu tribe irritated Ravanasuru who entered the war. There is no use even if Ravanasura used firearm to save water. Since Neelu is the son of Agnideva, that weapon did not work on him. Even after that, Neeludu killed the monster celebrities like Mahudara. On the other hand, the war was complete as Ravanasuru died in the hands of Rama.


Neeluni's role in Ramakatha remained forever..


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments