మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు

 🙏🌺మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు 


 మాసికాలు_ఎందుకు_పెట్టాలి

అన్ని_మాసికాలు_పెట్టాలా

కొన్నిమానేయవచ్చా🌺🙏



🌺వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 🌺


🌺అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.


కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.🌺


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.🌺


🌺ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది


ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.


ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.🌺


🌺యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.🌺


🌺దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు)


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.🌺


🌺ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.


ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.🌺


🌺ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.


వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.


అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.


ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.🌺


🌺ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.


మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.


తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.🌺


🌺కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.


ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.🌺


🌺పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 🌺


🌺గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  🌺


🌺వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

  తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.🌺

🌺ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి  మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.🌺

🙏🌺 maniṣi maraṇin̄cina tarvāta karma jarigina pim'maṭa nelanelā māsikālu peḍutuṇṭāru

Why _ to _ keep _ menstruation

Should _ all _ the _ monthly _ be _ kept

Can we come up with some


🌺 While telling the secrets of the Mahasadhana in the Vedavedantas, some are questioning, others are conspiring without observing their sensitive Vedabodha. The main reason for this is in these fathers. 🌺


🌺 The devils will stop us from practicing these good deeds which give us all the virtues and all the wealth easily. That's why these good words don't come to their ears.


These only reach those who have the blessings of the fathers.


What happens to the creature after death? How will the pindas we keep reach them? How does Preeta become a goddess? What is the benefit of pindas? These are the key questions in it.


An upanishad is telling the answer to these. The name of that Upanishad is Pindopanishad. This belongs to Atharvana Vedasakha. This Veda is mostly of Karmayoga. This includes more about how to perform Nithyanimithika Kamya Yagna. These secrets are told in this Upanishad of this.


This is how the goddesses and Maharshis questioned Brahmadeva.


How do they accept the fetus offered to the dead? These are the questions that have been raised.


In answer to that, Brahma told details about the body of the body. 🌺


After death, the five-bhootas will be separated from the five-physical body. 🌺


🌺 This body is formed with the great ghosts of earth, fire, water, air, sky


When the body in this will leave the body, the panchabhootas will go as they came. This is also agreed by modern medical scientists.


First the air goes away (breathing). Five lives will be lost because of it. The wind and then the fire goes out. The body will be cooling down. Vaishwanaragni will go away. Then the water in the body dissolves from the nine holes of the skin. When air, water and fire are escaped from the body, the geopolitical metals will remain in the form of bones, hairs and nails. These will mix in the earth. The body is mixing in the sky. This is what happens in a nutshell. This is the way the panchabhootas go.


In fact, in addition to the gross outer body we see, the body is the cause of everyone.


Because the body is the body that carries the bags of sins we have committed for another life. Another body goes in search of the sinful things in its bags. That's what a new body gets. 🌺


🌺 Tortured body will go to hell or heaven. Different bodies like this, if they go away, the love of the dead will remain.


For ten days in front of Preeta, she will be roaming around her house, her family and her assets. The evergreen that is put at that time will come in the form of crow and take it.


After this, on the tenth day, the mornings that are left by friends, relatives, friends will quench its thirst. After ten days, she will be satisfied with these and leave those who think she is mine.


So it's in the form of a prey. The corpse will remain in this form until the 12-day process is completed, the mediocre menstruation is conducted, and the pre-processed spindication is done.


After the impeachment, in the front of her class, her father, grandfather, grandfather, grandfather, father, father, father in the place of her father in the vacancy. The father is getting the place of God. 🌺


🌺 The new body it needs will be received in the form of monopoly done by menstruation. The dead who left yesterday's outer body and lost the body of the torment and has no body as a ghost, will get a new body through the fetus that is meant only for him in the months.


The new body will be seeded by the first fetus of these. This is what he said is Kalanam.


After this, the skin of the meat will be formed by the second fetus.


The third fetus will bring you a lesson. (The brain)


The fourth fetus creates a pulse in the bones and bones. 🌺


🌺 The fifth fetus will form the head, face and fingers.


Six fetus form parts of the heart, neck and mouth.


The oath of life comes through the seventh fetus.


Systems of the word are formed by the eighth fetus.


All the organs are strengthened by the ninth fetus.


The tenth fetus gives the physical perfection needed for a new life.


In this way, due to the fetus donation in the menstruation, the whole body is caused by the fetus. 🌺


🌺 The parents who have given their body to enjoy the comforts of the world should be repayed by conducting menstruation and offering them the necessary fetus to build their body.


In fact, all 16 squirrels will be given this time of year.


Pindopanishad said that about 10 of these fetus are used as food to contribute to the dead to get new bodies, many myths along with Garudapurana say about the rest of the pindas.


Moreover, the way the Panchabhootas go away from the body of the dead, the same way the five bhootas come back to form their physical body.


Firstly, the sky which is the reason for giving property to the creature will give him space. Upanishad says then fire, water, gas, earth philosophies will give him body.


So all the menstruals have to be given to the dead. There is no alternative to menstruation. 🌺


🌺 If whatever is left, if it is too much of a fetus, the things that should be formed at that stage will be disabled to death.


If we don't give so much fetus to our father who gave us a luxury body that we can't get even after spending crores of rupees, we will become disabled. Don't make the mistake of being the worst.


This kind of disability will happen if you stop menstruation. If you don't suppress, you won't get the form of father goddess.


If you don't release your father's prejudice, all the next generations will remain in prejudice. 🌺


🌺 So doing mediocre menstruation is not only for the dead, but also for the doer. It's like making a good way to avoid misery.


These are the myths and the secrets of the fathers telling by the Upanishads.


It's all a common must do.


If you want to do these more lovingly, you should do it in the shrines of Kurukshetra, Prayaga, Kashi, Gaya etc.


If we do this, we will become a week of giving them special bodies. It will benefit us. The best bodies they have will give us more and more wealth. 🌺


🌺 do fetus go to ghosts? This Pindopanishad is the answer to those who do separatism.


Indeed, the Upanishads are all a group of secrets. Though they seem to be common words that make sense on the top, there are many secrets behind them that only the superstitions know.*


Only the achievers and industry-made scientists can get it. They don't tell everyone these. Just say do falana pindadanas in falana place. 🌺


🌺 why do you do it in the gaya? There are a variety of reasons why you should travel. All the places that are being said as holy places are the body of the Lord. One is head, the other is heart, legs, hands.... etc.


Those who can't do this in those areas should do at least where they are.


If those who are able to go, go to things like prayaga kumbhmelas, the divine results will come from the joy of the father. 🌺


🌺 Those who can't go will be blessed by praising them even if they are mentally.

By saluting your elders, performing Swadha Namasadhana, reciting Swadha Stotra, Pitrustotra and giving gram to the cow for a day, you can get the best wealth from a place where there is. 🌺

🌺 These are the secrets of menstrual fetus. All menstruals are related to Brahmin caste! So many people are doubting what is the matter of other castes. Other castes should donate self-interest if it means turtle shradham. It should be done before 12 am. Brahmin caste people after 12 Food should be served to the devotees during the afternoon period. 🌺


Comments