అరిషడ్వర్గాలు-వివరణ

 *అరిషడ్వర్గాలు-వివరణ*



*1. కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన అతిగా ప్రతిదీ కావలనే కోరికలు కలిగి యుండడము.*


*2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని భావించడం ఇతరులను నిందించడం వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.*


*కృష్ణపరమాత్మ గీతలో క్రోధం వలన అనేక అనర్ధములు సంభవిస్తాయి అనే విషయాన్ని చెప్పారు*


"క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి" 


*3. లోభము – కోరికతో ఎంతో సంపాదించి తాను సంపాదించుకున్నది, పొందినది  తనకే కావాలని అదేశాశ్వతమని  పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు ఎక్కడచెందుతుందోనని, ఎవరికీ చెందగూడదని దానములు, ధర్మకార్యములు  చేయకపోవడము.*


*4. మోహము – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, తనుకాక ఇతరులు తాను కోరినది పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.*


*5. మదము – తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.*


*6. మాత్సర్యము – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య, తాను పొందడూ ఇతరులు పొందితే ఓర్వలేడు, ఈ లక్షణం కలిగి యుండడము.*


*ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. ఈ అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.*


* Arishad classes - explanation *


* 1. lust - want it. To crave for it, to have the desire to have everything beyond needs.*


* 2. Anger - Regretting for not fulfilling your desires, thinking that others are the reason for not fulfilling your desires, blaming others, taking decisions with eagerness to take revenge on them.*


* In the Krishna Paramatma Gita, it is said that anger can cause many disasters *


′′ Krodadbhavati Sammoha Sammoha Smriti Vibramah Smrutibhramsha Dbuddinaso Buddhinasha Tranasyati ′′


* 3. Lobitism - Don't do charity and good deeds saying that what he has earned by desire is for himself and what he has got is for himself.


* 4. Mohmu - To have exactly what he wants, to be very eager that others should not get what he wants, to be unbearable if others get what he wants.*


* 5. Madamu - By fulfilling all the desires, we are proud that it is our greatness and do not consider others as no one has this strength.*


* 6. Matsaryam - The wealth that he has dissolved should not be there for others, if he doesn't get it, he is jealous that others shouldn't get it, if he doesn't get it, he cannot bear it if others get it, having this characteristic.*


* These Arishads are joining the body and stealing the goodness and causing bad deeds. If you take care of these Arishad classes from thieves, the path to freedom will be easy.*

Comments