కృష్ణుడు

 కృష్ణుడు:



నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.


వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.


నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి, నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.


దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.


నీళ్ళల్లో రుచి, సూర్యచంద్రులలో కాంతి, వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే.


త్రిగుణాలన్ని నా ఆధీనమే,నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతున్ని ఐన నన్ను తెలుసుకోలేకపోతున్నారు.


త్రిగుణాతీతమూ,దైవతమూ ఐన నా మాయ దాటడానికి సాధ్యము కాదు.ఐనా నన్ను శరణు జొచ్చువారికి అది సులభసాధ్యము. రాక్షసభావులూ,మూఢులూ,మూర్ఖులూ,నీచులూ నన్ను పొందలేరు. ఆపదలపాలైనవాడు,తెలుసుకోగోరేవాడు,సంపదను కోరేవాడు,జ్ఞాని అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురూ ఉత్తములే కాని జ్ఞాని ఎల్లపుడు నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు కాబట్టి అతడు నాకు,అతడికి నేను చాలా ఇష్టులము, అతడు శ్రేష్టుడు.


అనేకజన్మల పిదప "వాసుదేవుడే సమస్తము" అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు.


ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ధ, విశ్వాసం కలిగేలా చేస్తున్నాను.వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు.నన్ను సేవించినవారు నన్ను పొందుతారు.


నిర్వికారమూ, సర్వాతీతము ఐన నా స్వస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు.యోగమాయచే కూడినవాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోని సర్వజీవులూ నాకు తెలుసు.నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఃఖాలచే జీవులు మోహించబడుచున్నారు.పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్నీ, పరబ్రహ్మనూ తెలుసుకుంటారు. భూతాధిపతిని, దైవాన్ని, యజ్ఞాధిపతిని ఐన నన్ను తెలుసుకొన్నవాళ్ళూ మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు..🙏🙏 

Krishna:


Listen, I will tell you the knowledge of how to know me completely, what to know and what you don't need to know anymore.


One of the thousand is trying for salvation. I'm getting to know which one of those thousand.


This nature of mine is divided into eight parts of earth, water, fire, air, sky, mind, intelligence, pride. My nature is the best to wear the whole universe than this visible infamous nature. All ghosts are born by these two natures. I am the reason for creation and destruction. There is no one better than me.


As if the beads were stitched on the thread, everything is sitting on my own.


Taste in the water, light in the sun and moon, ′′ Om ′′ in the Vedas, sound of the sky, manhood in the humans, fragrance in the earth, brightness in the fire, life in the creatures, penance in the tapas, root cause of all living beings, courage in the intellectuals, strength without lust in the strong, I am the lust that is not against religion in all living beings.


All the triplets are my control, I am not for them. As the whole world is mesmerized by these triple qualities, they are unable to know me forever.


Triangle and Divine cannot cross my illusion. It is easy for those who surrender to me. Demons, fools, idiots, and scoundrels can't get me. I am served by the four good deeds called the one who is in trouble, the one who knows, the one who seeks wealth, the one who is wise. These four are the best, but the wise man always serves me with his heart, so I like him a lot, he is the best.


The wise man who understood that ′′ Vasudeva is everything ′′ for many births will serve me.


Whoever worships any goddess, I am fulfilling their desires only through the goddesses. Giving attention and faith to those goddesses. They get the goddesses they worshiped. Those who serve me will get me.


Ignorant people consider me as a human being as I am not able to recognize my selfless and sovereignty. They don't know me by being fit. I know all living things past, future, present. No one knows me. The creatures are being attracted by the happiness and sorrows caused by rag and hatred. Only sinless virtues can serve me. Only those who worship and practice me for the sake of salvation will know Karmatatva and Parabrahma. Those who know me as Bhuta dipathi, God, Yagna dipathi will never forget me even in the time of death.. 🙏🙏



Comments