అన్నదానం. విశిష్టత గురించి

🥗అన్నదానం. విశిష్టత గురించి



🍒అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. 🍒

అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు.

 🍓అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి🍓

🍅🍅ఆ అమ్మను నిత్యం కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా తలుచు కోవాలి.🍅


🍇అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. 🍇

🍈ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం..

🍍🍍 "దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న".. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు🍍🍍

🍑.. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు.., ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా., ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. 

🍋కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు... కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును... 

అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు.🍋

🥝 ఆకలిగొని ఉన్న వారికి అన్నదానం చేయలేక పోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.🥝


🍈త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. 🍈


🍓దానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, దానాల్లో కూడా అన్నదానం, వస్తద్రానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది అన్నదానము.🍓 దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహాన్ని తీర్చటం ద్వారా వారికి మనమెంతో మేలుచేసిన వారమవుతాం. 🍓

వస్తదానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండ, వాన, చలి నుండి పేదలకు కాపాడిన తృప్తీ మనకు దక్కుతుంది.🍓


🥒మనం చేసే దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు🥒🥒.

🥕🥕కర్ణుడు, బలి చక్రవర్తి మొదలైనవారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ, ఇతిహాసాల ద్వార మనకు తెలుస్తుంది. ఒక మనిషి మరణించినా అతడు చేసిన దానధర్మాల వలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.🥕🥕


🌽 దానగుణం లేని మనిషికి మోక్షం కలగదు. ప్రత్యుపకారము ఆశింపక చేసే దానం అత్యున్నతమైంది. ఆకలితో ఉన్నవారికి అనాధలకు, పేదలకు, రోగులకు, వికలాంగులకు, అన్న వస్త్ర ఓషదులు మొదలైనవి లేనివారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అనబడును.🌽


🍆అన్నదానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరి గాని 'పరతమ' భేద వైఖరి అస్సలు ఉండకూడదు,🍆 చూపకూడదు🍆. 

🥕సంపద గల వారికి, అధికారం గలవారికి, బందుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిధ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్ర దానం అవుతుంది. బందుమిత్రులనే ప్రీతి లేకుండా ఉండి ఆర్ధిక స్థోమత లేని, శారీరక శక్తి లేని వారికి వృద్దులకు, ఆభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్పూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపౌతుంది🥕🥕.


🍅 పేదవారిని పక్కనబెట్టి అయిన వారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు, నిరుపేదలను "దరిద్ర నారాయణులు" భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇది. అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలు ఉన్నాయి.🍅


🌽🌽ఉన్నోడికి అన్నం పెడితే పెట్టిన వారి మేలు కోరుతాడో లేదో తెలియదు కాని లేని వాడికి పట్టెడు అన్నం ప్రేమతో పెడితే వారి దేహాత్మ లోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వచనాలు ఇవ్వకున్నా అంతకు మించి దీవిస్తారు..👌 మన పేరు వారికి తెలియకున్ననూ వారంటారు... ఏ తల్లిదండ్రులు కన్నబిడ్దో మా అయ్యా, మా దొర, మా దేవుడు కడుపునిండా కమ్మని అన్నం పెట్టించాడు ఆయన కడుపు సల్లంగుండా, వాళ్ళ భార్య పిల్లలు సల్లంగుండా, వాడ సల్లంగుండా, వంతన సల్లంగుండా అని నిండు మనస్సుతో దీవిస్తారు.. 🌽నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు వచ్చే జన్మకు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి👌. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎదో రకంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది. 🌽


🥗చాలా మంది అన్నదానం చేయడం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి..? అనే ప్రశ్నకు మనస్సులో మేదలాడే ప్రశ్నలెన్నో..! 🥗అన్నదానం చేయడంలో ఒక పరమార్ధంతో పాటు ఆనందం ఉన్నది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు..👌 భౌతిక శరీరాన్ని 'అన్నమయ కోశం లేదా ఆహార శరీరం' అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో కూడి ఉన్నది. అన్నదానం చేస్తే వారికి శరీరాన్ని అందిస్తునట్లే..👌 ఆహారం పట్ల కొంత స్పృహని , అవగాహనని మీలో కలుగ చేయడానికి అన్నదానం మీకొక గొప్ప అవకాశం.. మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు..,🥗 అది జీవితం. మీ ముందు ఆహారం వున్న ప్రతిసారీ అది వాడి పడేసే పదార్ధంలా కాకుండా అది జీవం అని అర్థం చేసుకోవాలి.🥗


🍋మీ జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంగా చూడాలి..., 🍋ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి.🍋 

🍋అలాగాక మీరు వాటిని ఒక పదార్ధంగా చూస్తే మీ వ్యవస్థ మార్కెట్ లా తయారౌతుంది. ప్రేమ, అంకిత భావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. 🍋

🍊మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు కాబట్టి.🍊


🍉భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. 🍉ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. 🍉

🍉ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.🍉


🍏ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటూ వుండదు. 🍏అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి🍏. తినే పదార్ధాలని వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ వుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది.🍏🍏


🍓అలక్ష్యం చేస్తే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవి చూడవలసి వస్తుంది. మనిషి పుట్టేప్పుడు ఏమి తీసుకురాడు, 👌ఈ మధ్య కాలంలో ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరూ ఏమి తీసుకువెళ్ళరు.👌 కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప.. 🍓భగవంతుడిచ్చిన సంపదలో మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు "అహం బ్రహ్మాస్మి" భావనతో తనలో దైవత్వాన్ని అలవరచుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు, ప్రాణులకు దానధర్మాలు చేయాలి..👌👌


🍒 "క్షుద్బాద" ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి 'స్థితి' కి రావాలి.🍒. ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది కనుక సాటివారి ఆకలి తీరుద్దాం... అన్నాన్ని గౌరవిద్దాం.. నలుగురిని ఆదరిద్దాం... తృప్తిగా జీవిద్దాం...🍒


🍇🍇అన్నం పరబ్రహ్మ స్వరూపం... 

అన్నదాతా సుఖీభవ..🍇🍇


 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🥗 Food donation. About the uniqueness


🍒 It is said that food is the form of Parabrahma. 🍒

No living being can live without food.

🍓 If food is available without any deficit means, the blessings of Kasi Annapurna Amma is necessary 🍓

🍅🍅 There will be no shortage of food and drinks for those who measure that mother daily. Every day while eating meals, that mother should be remembered with gratitude. 🍅


🍇 Food donation is equal to the result of crores of cows donation. 🍇

🍈 we can live whatever is missing. But we can't live if we lack food..

🍍🍍 ′′ In all the donations, food donation is the best ".. Elders say that there is no donation more than food donation 🍍🍍

🍑.. There is no end to the hope of a man... There will be no more control than that.., because whatever you give., how much ever you give, you will want more.

🍋 But those who have taken donation in food donation will get satisfied by saying that it is enough.. We may not satisfy those who have taken donation by any donation... But if we donate food, we can completely satisfy those who have taken donation...

There are people who consider food donation as a yagna. 🍋

🥝 Elders will tell you to show at least a house to feed the hungry even if you cannot donate food. 🥝


🍈 In the Treta Yuga, Dwapara Yuga, Yagna Yagadas, humans got salvation through penance. 🍈


🍓 There are many types of donations, even in the donations food donation, cloth, water donation, godanam, kanyadanam, gold donation, bhudanam etc are very unique. Food donation is the one that satisfies the man completely. 🍓 Water donation is the one who fulfills the thirst. Especially in the summer, by quenching the thirst of the passengers, we'll be a good week for them. 🍓

If you do the cloth, you will get the virtue of giving the cloth to the God. We will get the satisfaction of saving the poor from sun, rain and cold. 🍓


🥒 If we do the charity without any selfishness and expectation of any result, it is said that God will come to understand the donation 🥒.

🥕🥕 We know through mythology and history that God came to Karna, Bali Chakravarthy etc as a priest and accepted donation and gave them salvation. Even if a man dies, because of his charity, his name will remain forever. 🥕🥕


🌽 A man without charity will not get salvation. Donation is the highest in return. If you donate to the hungry, orphans, poor, patients, disabled, food, clothes, etc. to those who don't have food, medicines, etc, it is called a charity donation. 🌽


🍆 There should not be any biased attitude or 'Paratama' different attitude in donating food, 🍆 should not be shown 🍆.

🥕 It will be an unnecessary donation if you look down on the poor by giving special hospitality to the rich, the ruling, the relatives and friends. If you donate food wholeheartedly to the God who doesn't have any love for relatives and friends, who don't have financial stability, who don't have physical power, to the old people, to the fortunate people, if you donate food wholeheartedly, the result will be doubled.


🍅 If you keep the poor aside and serve them first, you won't get the virtue of food donation. Food donation means this is the great work done by the people who do not have any relation with us, by considering the poor as God by ′′ Garidra Narayanas ′′ There are mythical evidences that where food donation is done, God will come in the form of poor. 🍅


🌽🌽 Don't know whether he wants the good of those who feed the person who has it, but if you give food to the person who doesn't have it with love, the soul in their body will be satisfied and they will bless more than that even if they give Veda blessings.. 👌 They say that they know our name... My father, which parents are born, Our master, our God has given food to the kamma from the stomach. He will bless with full heart saying that his stomach is sallangunda, his wife and children are sallangunda, wada sallangunda, vantana sallangunda.. 🌽 Really, those blessings are not only for the life time of the donor, but for the next birth, those good fruits will be blessed 🌽. Something for this food donation program Everyone who helps in a kind way will get that virtue. 🌽


🥗 We see many people donating food. Then why should we donate food..? There are many intelligent questions in the mind..! 🥗 There is happiness in donating food along with a meaning. It's not just feeding.. 👌 The physical body is called ' Anamaya cell or food body ' because it's rich in food nutrients. Donating food is like giving body to them.. 👌 Food donation is a great opportunity for you to create some consciousness and awareness about food.. You don't just see it as food.., 🥗 That's life. Every time you have food in front of you, you should understand that it is life, not the thing that he throws away. 🥗


🍋 If you want to elevate your life you must see food, water, air, earth as a living being..., 🍋 Because these are the important ingredients for your body building. If you take these as a biological shelter, they behave very differently in your bodybuilding. 🍋

🍋 And if you see them as a substance your system will become a market. By serving and donating food with love and dedication, you will have a deep relationship with others. 🍋

🍊 you should do this with great dedication. Because you get the chance to give someone life through it. 🍊


🍉 Before eating, the first hand is offered to the Lord and it is kept for crows, other birds and animals. 🍉 Doing this will be like submitting to God. 🍉

🍉 They also say that by putting some rice to crows before eating food, you can get rid of Saturn's doshas. 🍉


🍏 If we follow such things, there will be no deficit between our home and our health. 🍏 Everyone's thoughts will walk in the right path 🍏. If you keep using the food items without wasting, that Annapurnamma mother will always shower grains in your heart. 🍏🍏


🍓 If you do negligence, you will have to read the situation where you don't want to go for devotion. Man doesn't bring anything when he is born, 👌 nowadays no matter what he earns or how much he collects, no one takes anything when he is gone. 👌 Except for the results of good and bad karma.. 🍓 As long as a man is alive in the wealth given by God, he should practice the divinity in himself with the feeling of ′′ Ego Brahmasmi ′′ and do charity to the equal beings and living beings as much as he can.. 👌👌


🍒 ′′ barbaric ′′ hunger has to come to a level where we realize that the hunger of others is also the same. 🍒. Hunger is the same for all so let us satisfy the hunger of the equal... Let us respect food.. Let us respect four people... Let us live satisfactorily... 🍒


🍇🍇 Rice is the form of Parabrahma...

Happy food giver.. 🍇🍇


 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments