అక్షయ తృతీయ ప్రాముఖ్యత
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 14 మే 2021 అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం
1. పరశురాముని జన్మదినం.
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.
3. త్రేతాయుగం మొదలైన దినం.
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
అక్షయ తృతీయ నాడు , మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా , (అది పుణ్యం కావచ్చు , లేదా పాపం కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా , ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ , కూజాలో గానీ , మంచి నీరు పోసి , దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే , ఎన్ని జన్మలలోనూ , మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిధులకు , అభ్యాగతులకు , పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే , ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు సమర్పించుకుంటే , మన ఉత్తర జన్మలలో , వాటికి లోటు రాదు. గొడుగులు , చెప్పులు , విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.
అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.
*అక్షయ తృతీయ 2021: శుభ సమయాలు*
డ్రింక్‌పాన్‌చాంగ్ ప్రకారం , అక్షయ తృతీయ పూజ ముహూరత్ 05:38 నుండి 12:18 వరకు (వ్యవధి - 06 గంటలు 40 నిమిషాలు).
తృతీయ తితి 2021 మే 14 న 05:38 వద్ద ప్రారంభమవుతుంది
తృతీయ తిథి 2021 మే 15 న 07:59 గంటలకు ముగుస్తుంది
*అక్షయ తృతీయ బంగారు కొనుగోలు* సమయం 2021 మే 14 న 05:38 గంటలకు ప్రారంభమై 2021 మే 15 న 05:30 గంటలకు ముగుస్తుంది. (వ్యవధి: 23 గంటలు 52 నిమిషాలు)
Akshaya third importance *_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Vaishakha Sudha Tadiya is celebrated as Akshaya Tritiya. 14 May 2021 Akshaya Tritiya. Today only Simhachala Varaha Narasimha Swamy's Chandanotsavam will also be held. Swamy gives real darshan to devotees. Akshaya Tritiya has many importance. Let's see some of that
1. Parshuram's birthday.
2. The mountain day when the holy Ganga river touched the land.
3. is the day when the third era started.
4. The day when Sri Krishna met his childhood friend Kuchelu.
5. The day when Vyasa Maharshi started writing ′′ Maha Bharata ′′ with the help of Ganesha.
6. is the day when the Sun God gave ′′ Akshaya Patra ′′ to the Pandavas who are in Agnatha Vasam.
7. The day when Kubera was appointed as the protector of all wealth with Sri Mahalakshmi by praying to Shiva.
8. The day when Adishankaras told ′′ Kanakadharastavam
9. is the day when Annapurna Devi accepted her incarnation.
10. is the day when Draupadi was saved by Sri Krishna from Dusasan.
On the day of Akshaya Tritiya, whatever deed we undertake, (it may be a virtue, or a sin) will always follow us, continuously, irrespective of births. All the good deeds are united. So, if we pour good water in a new pot or jar that day and offer it with respect to the thirsty, in many births, our life will not get a situation of thirsty throat drying. If we offer guests, visitors and peanuts, there will never be a day when we have to starve. Clothing donation will get results accordingly. If we offer self-respect to the eligible, south, tambuladu, in our northern births, there will be no shortage of them. You can donate umbrellas, slippers, visana sticks. It is very good not to go to the prohibited rituals especially on that day.
Akshaya is believed to bring third luck and success.
* Akshaya Tritiya 2021: Good times *
According to Drink Pan Chang, Akshaya Tritiya Puja Muhurat from 05:38 to 12:18 (Duration-06 hours 40 minutes).
Third date starts on 2021th May 14 at 05:38
Third date ends on 2021 May 15 at 07:59 o'clock
* Akshaya Tritiya Gold Purchase * Time starts on 2021 May 14 at 05:38 and ends on 2021 May 15 at 05:30 (Duration: 23 hours 52 minutes)
Comments
Post a Comment