Human life

 


ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.


ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు... ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.


ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం. 

ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.


అశాంతి కారకాలైన కోరికల ఉద్ధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. 

సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.


అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది. ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు...


గాఢనిద్రలో వేటితోని పనిలేకుండానే మనశాంతి లభిస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు..


గాఢనిద్రలో లభించే మనశాంతి మానవుని లోని ఆత్మతత్వానికి నిదర్శనం. 

మనం మనశాంతిని, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటాము. 

అందుకే మనశాంతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది....

అనుకున్న పనులు చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే మనశాంతి కలుగుతుందని మన భావన. 

ఈరోజు మనం శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని మనశాంతిగా భావిస్తున్నాము...

నిజానికి మనశాంతి, తృప్తి , ఇవన్నీ మనలోని ఆత్మ సుగుణాలు. 

శరీర క్రియలతో, మనోభావాలతో పనిలేకుండా అవి మన సొంతం. 

పగలంతా అనేక శరీర క్రియలతో కష్టసుఖాలు అనుభవిస్తున్నాం. 

స్వప్నంలో దేహంతో పనిలేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష, దుఃఖాలను పొందుతున్నాం. 

నేను దేహాన్ని కాదు, దేహిని అనే భావం మనలో కలిగాలి, ఎలాంటి పరిస్తులలో వున్నా నాది ఇది కాదు , నాదంటూ ఏమి లేదు అనే భావన రావాలి... అప్పుడే మనశాంతి కలుగుతుంది...

నిద్రలో అప్రయత్నంగా మనశాంతి పొందటానికి అదే కారణం...

Because this body has one, it must not meet its needs. Basic needs like food, water, clothes should be fulfilled.


If hunger is fulfilled, the body will calm down, but the mind that tastes will not calm down... If the hungry body is needed, the taste will be given to the heart.


If it is right to meet the physical needs of the nature, it is a matter of peace that wants to meet the mental corks that do not have any alliance.

No matter how wise the stomach will be filled only if he eats food. So body nourishment and protection are essential to us.


Patience is very necessary for the mind to reduce the quotation of unrestless desires.

If we know the truth that the peace that we want to get through happiness and happiness is within us, we will create a holy life that cannot be searched.


Similarly, if you practice a sacred way of life, the mind will realize the truth and get self-happiness. Our elders asked us to practice Dharma only for this holy life...


In deep sleep, without any work, you will get peace of mind, why is it not possible to wake up..


The peace of mind that is found in deep sleep is the proof of the self-self in human being.

We are supposed to attain peace of mind and contentment through happiness.

That's why we need to search for peace of mind....

We think that peace of mind will be achieved only by doing the things we want and keeping the body happy.

Today we feel peace when we can do what we want with the body and feel the things we like with the mind...

Indeed, peace of mind, contentment, these are all the qualities of our soul.

It is our own without any work with physical functions and emotions.

We are suffering with many physical functions throughout the day.

In the dream, we are getting happiness and sorrows with many mental feelings that are not working with the body.

I am not a body, the feeling of body should be there in us, in whatever situation it is, this is not mine, there should be a feeling that there is nothing like mine... then only we will get peace of mind...

That is the reason for effortlessly getting peace of mind in sleep...


Comments