వేంకటేశ్వర అవతారానికి మూడు ప్రధానమైన కారణాలు

 వేంకటేశ్వర అవతారానికి మూడు ప్రధానమైన కారణాలు


1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.


2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.


3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)

సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.


వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతనన్నాడు.


ఓం నమో వేంకటేశాయ


There are three main reasons for the incarnation of Venkateswara



 1. One day Narada Muni went to Sri Mahavishnu and asked him.  In the Kali Yuga, human beings live a short life, having no mind at all on God.  Then Sri Mahavishnu said, I will become Sri Venkateswara to wash away their sins and uplift them.  I will take away their sins even if they come to my hill once and offer their head hairs, visit me, and do a single earned service (as virtuous as doing horsemanship in Kaliyuga. It is very difficult and forbidden to do in the original Kaliyuga).  Even if their money is not spent, it is enough to submit the head hairs.



 2. Yashodamma was fortunate enough to raise Chinnikrishna during the Dwapa era.  There is no one in this world as lucky as Yashodhamma.  She was the only one to have the cosmic vision two or three times without Yashodamma.  Krishna's childhood sports were not so common.  When Vyasa Bhagavan wrote Bhagavatam in Sanskrit, the Potanacharyas translated it into Telugu.  But Yashodhamma had one wish left.  Rukmini could not see the welfare.  Then if she asks, Krishna promises that I will become Venkateswara in Kaliyuga, that you come as Vakulamata and do my kalyana.



 3. Understand the Vedavati (should be married)

 Just as Seethamma was found, so was she found on Darbhala.  Growing up slowly and reaching the age of puberty, her father decided to get married.  Then she told me that I would actually marry Srinivasan.  Then the father said, the word is to marry Srinivasan.  Look at how much penance Parvati Devi did for Shankara.  Then Vedavati also went to Himavat mountain and did penance.  While she was meditating, when Ravanasura came to see her, Vedavati cursed him (saying that you will be destroyed by a woman, she is Seethamma) and entered the fire.  At that moment Agnihotra rescued her and adopted her as a daughter.  Some years later, Agnihotra was seen ascending the heights of Ravana Seetamma.  Ravanasura angrily said that he did not even salute, saying that the Sita in your chariot was not the real Sita, but the Maya Sita.  That the original Sita was with me.  Then Ravanasura was very happy and took Mayasita, who was near Agni Hotru, to Lanka thinking that he was a real Sita.  The real Sita remained with Agni Hotru.  On behalf of Asalasita, Vedavati stayed in the forest of Ashoka for 12 months and brought Rama and Ravana Vata.  When Vedavati had finished her work, Agnihotra approached her.



 Sita is the essence of the Vedas.  Vedavati is the form of Seethamma.  In fact there are not two, there is only one.  Speaking of Ravanasura, Ravana reads the Vedas and regularly worships Sandhya.  He did a lot of penance but did not pay attention and did not have a crooked mind.  That is why he died at the hands of Rama.  He worshiped Shankara a lot but did not know that Sita was Parvati.  He wanted to be in the form of his goddess.  Since Vedavati was in Asokavanam on behalf of Seethamma for 12 months, Agnihotra wanted to adopt Vedavati as his wife along with Ramu.  Then he said, In this incarnation I am writing monogamy.  He said that I incarnated as Sri Venkateswara in Kali Yuga and married Vedavati (Padmavati Amma).



 Om Namo Venkatesaya




Comments