గీ తా ప ర మా ర్ధ ము!!
🍀🌺💐 మహాభారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!! యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం.రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!!
శ్రీకృష్ణ భగవానుడు దాదాపు 126 సం.రాలు జీవించియున్నాడు!! భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు. కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహాసనముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!
మహాభారత యుధ్ధము "కురుక్షేత్రం"లో 18 రోజులు జరిగింది!!
కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవరోజున నేలకొరిగాడు!!
11 వ రోజున అంటే.. మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో దృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా మొదటి సారి హస్తినాపురములోని సభలో ఉన్నవారందరూ దృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!
కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన కురు - పాండవ సేనావాహినుల మధ్యన రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో విషాదముతో బాధపడుతున్న అర్జునుని నిమిత్తమాతృనిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!
లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!
మనం ఇంతవరకు వ్యక్తుల జన్మదినం జరుపుకుంటున్నాము. జ్ఞాన ప్రదాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అధ్భుతమైన విషయం!!
లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41 వరకు 18 అధ్యాయాలుగా ఉన్న భాగమే "భగవద్గీత"!!
కలియుగం ప్రారంభమై 5118 సం.రాలు గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితే 5154 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5155 వ గీతాజయంతిని జరుపుకుంటున్నాము!!
కృష్ణం వందే జగద్గురుమ్.
భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేత ఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.
శ్లోకం:- పార్దాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్
1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింపబడినది.
2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?
జ. గీతలో 700 శ్లోకములు కలవు.
3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?
జ. గీతలో 18 అధ్యాయములు కలవు.
4. ప్రతి అధ్యాయమునకు ఇవ్వబడిన ప్రత్యేక నామము ఏది?
జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.
5. గీత ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్ధారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణ పరమాత్మచే చెప్పబడినది.
6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.
7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?
జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.
8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
జ. గీత శ్లోకాలు మానవునిలోని అజ్ఞానాన్ని దూరం చేస్తాయి.
9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.
10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయుడు.
11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?
జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము
12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?
జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.
13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?
జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: - పృథ (కుంతీ దేవి అసలు పేరు పృథ) పుత్రుడు.
3) కౌంతేయ - కుంతీ కుమారుడు.
4) అనసూయ - అసూయ లేనివాడు.
5) కురునందన - కురు వంశమున జన్మించినవాడు.
6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు. అంతం చేయువాడు.
7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ - ఇంద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ - ధనమును జయించినవాడు.
10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు.
14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?
జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి? వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము "ధర్మ".
గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము "మమ".
17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?
జ. ఆర్తి, అర్ధార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.
2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
ప్రార్దించువారు అర్దార్దులు.
3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,
సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును.
4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.
18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ 17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును
వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట.
అసుర లక్షణాలు : డంబము, గర్వము, దురభిమానము, కోపము, పరులను పీడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.
19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము
20. ఇంద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.
21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం పరధర్మం, స్వధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.
22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.
23. "యోగం" అంటే అర్థం ఏమిటి?
జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .
24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా నిర్వర్తించటం
Gee ta para ma rdha mu !!
36 36 years after the Mahabharata war, the Dwapa era came to an end and the Kali Yuga began !! Lord Krishna was 90 years old during the war !! Kali has been in existence since the death of Sri Krishna !! That is the beginning of Kali Yuga !!
Lord Krishna lived for about 126 years !! King Dharma was crowned after the victory of the Indian War. After hearing the news of Krishna's demise, the Pandavas, including Draupadi, went to the Himalayas chanting "Maha Prasthanamu" !! That is, Yudhishthira sat on the throne of Hastinapura and ruled this planet as a dictator for 36 years !!
The Mahabharata war lasted for 18 days in "Kurukshetra" !!
The Mahabharata war started on the day of Karthika's new moon !! Bhishma died for 10 days and fell to the ground on the tenth day !!
On the 11th day, that is, on Margashira Shuddha Ekadashi, Sanjaya recited the Bhagavad Gita in Kurusabha to Dhritarashtra, telling him the news of war !! Thus for the first time all those present in the house at Hastinapuram heard the Dhritarashtra Maharaja as well as the citizens !!
Lord Karthika preached the Bhagavad Gita to all of us as the mother of Arjuna, who was squatting on a chariot among the immense Kuru-Pandava warriors and suffering from despair and despair before the start of the war at sunrise on Karthika's new moon day !!
The only thing the world has is Margashira Shuddha Ekadashi, so today we celebrate "Gita Jayanti" !!
We have been celebrating people's birthdays so far. Celebrating the jubilee of a book that is the source of knowledge is a wonderful thing !!
The "Bhagavad Gita" is the part of the Laksha Shloka Mahabharata which consists of 18 chapters from 24 to 41 in the Bhishma Parvam !!
5118 years have passed since the beginning of Kali Yuga !! 5154 years if 36 years are added to it !! Now we are celebrating the 5155th Gita Jayanti !!
Krishnam Vande Jagadgurum.
There are 700 hymns in the Bhagavad Gita. There is no time or patience in this mechanical lifestyle in the present times to read them. So in the hope that you will know at least a few minutes of this introduction in the form of answers to this question in the form of Bhagavad Gita.
Shloka: - Pardaya Pratibodhitam Bhagavata Narayanevasvayam
Vyaseva Gradhitam Mahabharata in the midst of the epic movie
Advaitamrta Varshinim Bhagavatim Ashtadasadhyayinim
Amba Tva Mamavandadhami Bhagavad Gita Bhavadveshineem
1. The Bhagavad Gita is in which holy book?
జ. The Gita is described in the Bhishma Parva of Mahabharata.
2. How many hymns are there in Gita?
జ. There are 700 hymns in the Gita.
3. How many chapters are there in Gita?
జ. The verse has 18 chapters.
4. What is the unique name given to each chapter?
జ. Every chapter is about yoga.
5. Where, when, and to whom was the verse told?
జ. The Gita is narrated by Lord Krishna to Arjuna at the beginning of the Kaurava and Pandava war in Kurukshetra.
6. Why is the verse said?
జ. Navaru mamakaram, the passion of being killed by me envelops Arjuna and causes tragedy while Gita is taught by Sri Krishna to overcome sadness and bring wisdom.
7. How did the Gita change Arjuna?
జ. Gita turned Arjuna into a hero.
8. Gita verses remove what is in a human being?
జ. Gita verses dispel ignorance in human beings.
9. Who told Gita Dhritarashtra?
జ. Sanjaya explained the song to Dhritarashtra.
10. How many people heard the song at that time?
జ. Arjuna, Sanjaya, Dhritarashtra and Anjaneya.
11. What are the names of the chapters in Gita?
జ. 1) Arjuna Vishadha Yoga 2) Sankhya Yoga 3) Karma Yoga 4) Jnana Yoga 5) Karmasanyasa Yoga 6) Atma Samyama Yoga 7) Vijnana Yoga 8) Akshara Parabrahma Yoga 9. Raja Vidyarajaguhya Yoga 10) Vibhuti Yoga 11) Vishwaroopa Visitation Yoga 12 ) Bhakti Yoga 13) Kshetra Kshetrajna Vibhaga Yoga 14) Gunatraya Vibhaga Yoga 15) Purushottama Prapti Yoga 16) Divasura Sampadvibhaga Yoga 17) Shraddhatraya Vibhaga Yoga 18) Moksha Sanyasa Yoga
12. Why did Gita teach Arjuna only to teach Dharmaraj and Bhishma?
జ. Sri Krishna taught the Gita to Arjuna. The reason why Bhishma did not do so was that he prepared for war on the side of the unrighteous Kauravas, saying that justice, righteousness, was on the side of the Pandavas. There is a difference between thinking, saying, and doing. I.e. there is no trinitarianism. The founders did not deserve enlightenment. Dharmaraju was a Dharmavarta but there was no repentance other than his repentance. The one who inquires into its good and bad in advance of a work is precocious. He lost his gamble and began to repent and repent for what had happened in the woods. Did not think at first what its consequence would be. Those who do not repent are not entitled to chanting. It would be better for Arjuna to enter the battlefield and see all his people and kill these people and enjoy this kingdom. What joy can we experience ruling this kingdom when everyone is dead? He inquired in advance that I could not wage war if the Trilogy was given. He prayed to Lord Krishna to make him a disciple and teach him duty. Thus the Gita was taught to Arjuna himself. Repentance comes only to those who have a pure heart. Only a pure heart deserves enlightenment.
13. Sri Krishna addressed Arjuna with many names in the Gita. What are they? What do they mean?
జ. 1) Arjuna: - He has a pure and serene mind.
2) Partha: - Son of Pritha (Kunti Devi real name Pritha).
3) Kaunteya - son of Kunti.
4) Envy - One who is not jealous.
5) Kurunandana - Born in the Kuru clan.
6) Parantapa - Defender of enemies in battle. The finisher.
7) Victory - Always the winner.
8) Gudakesha - one who has sense restraint.
9) Dhananjaya - The conqueror of wealth.
10) Pandava - The son of the Pandava king (whiteness) is pure with sattvic virtue and purity.
14. Swami says to recite two verses and eat before meal. What are those verses? Why should they be recited?
Brahmarpanam Brahmahavih Brahmagnau Brahmanahutam
Brahmaiva honey destination Brahmakarma tomb
Ego Vaishwanaro Bhootva Praninam Dehamashrita:
Pranapana Samayukta: Pachamyannam Chaturvidam
15. How does Gita help us in eternal life?
జ. Swami is especially referring to the two verses in the Gita which are 'Shraddhavan Labhate Jnanam' - 'Suspicious Destruction'. The attentive must acquire knowledge. Both spiritual knowledge and worldly knowledge require a lot of attention. Thus Gita teaches that anything can be achieved with diligence. With diligence Nachiketu was able to attain enlightenment and solo archery. Those who have doubts of ‘skepticism’ will never prosper. Anyone who believes in God and believes in the Word of God can achieve anything. Therefore doubts and doubts should be left. Moreover ‘Advaishta Sarvabhutanam’ do not hate any creature. ‘Tactless sentence’ Do not torture anyone verbally. Satisfaction 'should always be satisfied. Samaschatrau cha mitrecha, enemies and allies should be treated equally. For the sake of honor, for the sake of unhappiness, one should not overflow and sink. Lord Krishna taught me that one who has such qualities is a dear devotee to me. This means that all human beings will be blessed by God if they adopt these qualities in their eternal life. Put only one match to cook. Also, even if we start practicing a single Gita verse, gradually all the virtues will enter us and we will become dear devotees of God.
16. Swami summarizes the Gita in two words? What are they? What is their description?
జ. "Dharmakshetre Kurukshetre Samaveta Yuyutsava:
Mamakaki Pandavaschaiva Keema Kurvata Sanjaya: "
The first word in the hymn is "Dharma".
The last verse of the verse
"Yatra Yogiswara: Krishna Yatra Partha Dhanurthara:
Sri Rvijayo Bhoothi: Dhruva Nithirmathirmama "
The last word in the last verse is "mama".
17. Who are the four types of devotees mentioned in the Bhagavad Gita?
జ. Aarti, Ardhardi, curious, wise
1. The Aartha devotee prays to the Lord with Aarti to support and protect him when he is in distress.
2. For the sake of money, for the sake of vehicles, for the sake of prestige, for the sake of son and grandson development
Those who pray are half-hearted.
3. Curiosity: With many fragrances and thoughts,
Do not seek intimacy by interrogating with good intentions.
4. Jnani: Constantly immersed in Brahmatattva.
18. How does the Gita describe divine attributes and demonic attributes?
జ. Divine Attributes: 1. Salvation 2. Integrity 3. Enlightenment 4. Donation 5. Abstinence
6. Yajna 7. Study 8. Penance 9. Hypocrisy 10. Non-violence 11. Truth 12. Anger 13. Sacrifice 14. Peace 15. Condemnation 16. Compassion of all living beings 17. Mindfulness of things 18. Forgiveness 20. Forgiveness 20.
Perseverance 21. Hygiene and cleanliness 22. Not betraying others 23. Mildness
24. Not to engage in immoral activities 25. Not to boast of oneself 26. Lack of stringy nature.
Asura traits: arrogance, pride, arrogance, anger, bullying, sly
Ignorance, pride in being great, violence.
Every human being should recognize the demonic qualities in himself, strive to get rid of them, adopt the divine qualities and make himself a devotee loved by God.
19. What is Yogamana?
జ. Yogamana is the immersion of the soul in the Paramatman
The way to include God as yoga
Yogamana pleasure
Equality is yoga
Yoga is the antithesis of the profession of the mind
20. Swami says to cultivate despair for the senses. What is the reason?
జ. In the Gita, when the soul enters another body from the body, it carries nothing but its good deeds and evil deeds. In the same way that gas carries the stench and fragrance of one place to another, nothing else is taken away from this world or from its home except the fruit of the soul's karma. Therefore, in the material world, one should turn the mind away from worldly pleasures towards good deeds, towards God, and adopt despair over worldly pleasures. Swami tells a short story about this. A householder has three friends. The case against him is going to be heard in court. He asks his friends to come to court with him and testify in his favor. The first friend said I would go out of the house to help you at home. The second friend said he would not come in unless he accompanied you to the court. The third friend said I will come to court with you and testify. The first ally is the treasures of grain. Second friend wife, cousins friends. The third friend is the good deeds we have done.
21. What is Swadharma? What is pro-religion?
జ. Spiritual dharma is paradharma and swadharma is bodily dharma.
22. What is the typical personality expressed by the names of Arjuna?
జ. We can learn from Arjuna by the above names how the disciple is ideal for education from the teacher.
23. What does "yoga" mean?
జ. Yoga is the union with God. Also the way (destination) to reach God.
24. How is yoga defined in the Bhagavad Gita?
జ. "Karmanu kashalam yoga:" is the Gita. That is, to perform the prescribed task wholeheartedly
Comments
Post a Comment