కర్పూరం ఎన్ని రకాలు?



 #కర్పూరం ఎన్ని రకాలు?




#కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం..


#కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధం గానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ, పారదర్శకం గానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.


ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం.  కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టు నుండి లభ్యమవుతుంది.


కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి.. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌ లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగ పడుతుంది.


#పచ్చ_కర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరం తోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.


#హారతి_కర్పూరం: టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.


#రస_కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.


#భీమసేని_కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.


#సితాభ్ర_కర్పూరం: ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.


#హిమవాలుక_కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.


#ఘనసార_కర్పూరం: ఇది మేఘం లాంటి సారం కలిగినది.


#హిమ_కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.


ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.


కర్పూరం వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:


1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.


2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.


3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.


4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లు అన్నిటిలోనూ, చర్మం పై పుతగా పూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.


5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.


6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.


7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.


8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.


9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.


10. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.


11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.


12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.


13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.


14. పురుగుల మందులు, చెడు వాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెద పురుగులు నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

#How many types of Karpuram?


#Let us know about camphor tree and health with camphor, the fragrance of camphor..


#Karpuram is aromatic as far as we know, and in some dishes, Hindus use it to offer Harati to God in their puja programs. This is a strong aromatic ritual that is white and transparent.


Many people think this is artificially made with chemicals. But, it is a literal truth that camphor is produced from a tree. The camphor is available from a tree called Comfer Laurel or Cinnamom Camphora (family: Laracy).


Camphor is made from the leaves and branches of those trees. Similarly, camphor is also made from some types of basil (camphor basil) species. They will put gates on the camphor tree stem. Milk comes from those gates. Camphor will be made with that milk. Camphor tree is a beautiful evergreen tree that grows up to feet. Contains a nice scented tatta. The leaves are long and will fall in February and March. Flowers are small.. fruits are dark green and will mature in October. These trees grow widely in China and Japan. In our country, these are grown in Nilagiri hills. Similarly, camphor trees can be seen in Mysore and Malabar area.


There are many types of camphor. It will be useful to us in some way.


#: _:: The camphor which collects the roots of the camphor tree, manu, branches in water and boils it in a distillation method is called Pachakarpuram. This could be used for drug experiments. This is used most in dishes. The bite will be done with this yellow camphor only. This is also used for anjanam.


#Harati _ Camphor: A artificial camphor made through chemical process from turpentine is called Harati Camphor (C10H16O). This should not be used for drug experiments.


#Rasa _ camphor: To get rid of the defects in the body of small children, camphor will be mixed with the ocean. That's called a juicy camphor.


#Bhimaseni _ camphor: The camphor that is naturally made from the plant is called Bhimaseni camphor or immature camphor. This will be used as a break for medicinal uses.


#: _:: It got that name because it looks like a white cloud.


#Himavaluka _ Camphor: It contains snow-like waves.


#: _:: This is a cloud-like essence.


#: _:: It's as cold as snow.


These are the morning Bhaskaram, Kamma camphor, Ootikam, Turu thirst, Hikkari, Potashrayam, Potasam, Tarabram, Tuhinam, Night Karam, Vidu, Muktaphalam, Rasa Kesaram, Praleyamsuvu, Chandra Nama, Gamburam, Bhutikam, Loka Tusharam, Clean Karam, Soma Sanjna There are many types of camphors like, Varna camphor, Sankaravasa camphor, China camphor.


Camphor has numerous health benefits. Camphor is used most in Ayurvedic treatment. If you suck the fragrance of the real camphor, it will be like all the physical diseases will go away and relaxation will be over. A peace of mind will take place. Some important health benefits:


For 1. small heart problems and fatigue problems, if you use a little bit of camphor, it will have results.


2. It works well for all types of arthritis, rheumatic pain reliever, nerve problems, back pain also.


3. Camphor is used to prevent insects, reduce eczema, blisters, bronchitis, and various infections in children.


It is also used as antiseptic for 4. nasal problems. That's why vicks veporub is used in all appointments, in ointments that are fresh on the skin, and inhaling medicines.


5. If you wet the mosquito in camphor oil and apply it on the wound caused by leprecy disease, it will be quicker.


6. If you dry the camphor and keep it in your mouth and swallow the saliva water, excessive weight will reduce.


7. will remove pollution and make the environment cleaner.


8. infections will not spread.


9. It is used in a bite because it is good for the eyes. Reduces cold and cough.


10. will cure even mental illnesses.


11. Purifies the blood and makes the blood circulation smooth.


12. Reduces waves, worries and gives happiness and happiness.


13. There is a possibility of attraction between women and men even in a holy place like a temple. There is a danger of being heartbreaking. The camphor will do good without having such lust and desires.


14. insect medicines are used to eradicate bad odors, bad insects that bite clothes and eat them.


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥



Comments